Wednesday, November 29, 2017

దేవుడా

అది 8వ శతాబ్దపు కాలం....

అప్పటి విద్యార్థులు గురుకులంలో గురువు గారికి శుశ్రూష చేస్తూ చదువు తో పాటు జీవితాన్ని నేర్చుకునే రోజులు.భారత దేశం లో అటువంటి  గురుకులాలు కోకొల్లలుగా ఉండగా , అందులోని  ఒకానొక గురుకులం లో జరిగిన విశేషాన్ని ఇచట  మీకు చెప్పదలచుకున్నాను.

దక్షిణ భారత దేశం లో ఉన్న ఆ గురుకులంలో  వేకువ జాము కావటం చేత చాలా హడావుడిగా నున్నది. విద్యార్థులు లేచి చక్కగా స్నానమాచరించి తరగతి  వద్ద అభ్యాసానికై ఆసీనులయ్యారు. గురువు గారు పీఠం మీద కూర్చుని ఉండగా తక్కిన విద్యార్థులు క్రింద కూర్చునున్నారు. ఆనాడు గురుకులాల్లో రుసుము తీసుకునేవారు కారు . గురువు గారి ఇంటి పని వంటి పని చేసి పెడితే , ఆయన  సంతోషించి వారికి పాఠాలు నేర్పేవారు.విద్య పూర్తి అయిన తరువాత ఎవరికి  తోచింది వారు ఇచ్ఛేవారు. ఉండడానికి గాని తినడానికి గాను ఎటువంటి రుసుము తీసుకునేవారు కారు. పేద వానికి , ధనవంతునికి , రాజా కుమారునికి ఒకలాగే విద్యాభ్యాసం జరిగేది. గురుకుల పద్ధతిలో తరగతులు, పరీక్షలు లేవు కావున అక్కడి విద్యార్థులు ఆనందంగా పాఠాలు నేర్చుకునేవారు. ఈ తరం పిల్లల్లా శ్రమపడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు వారికీ. కానీ ప్రతి రోజు పాఠాలు వల్లే వేసేవారు. సెలవు దినాలు , పనిదినాలు అంటూ అక్కడ ఏవి ఉండేవి కావు  . ఆనాటి విద్య నేర్పే సంస్కృతి చాల గొప్పది కావున భారతం సస్యశ్యామలంగా వెలిగింది.

శ్రావణ పౌర్ణమి నాడు మొదలిడి సంక్రాతి వరకు వేదం పఠనం చేసేవారు. తక్కిన రోజులు పురాణేతిహాసాలు గురువు చెప్పగా వినేవారు. అటువంటి పురాణాభ్యాసాకాలమున ఒకనాడు,శుక్రవారం ప్రహ్లాదుని గూర్చియు ,అతని కసాయి తండ్రి  నుండి అనుక్షణం రక్షిస్తూ వెన్నెంటే నిలిచిన నరసింహుని గూర్చియు చక్కగా చెబుతున్నారు. విద్యార్థులు రెప్ప వేయకుండా భక్తి తో ఆలకిస్తున్నారు. కానీ ఒక విద్యార్ధి మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు.

గురువు గారు ఎంతో నాటకీయంగా స్థంభం నుంచి ఉద్భవించిన నార హిరాణ్యాక్షుడిని ఒక దెబ్బతో ఎలా కింద పడేసాడో వర్ణిస్తూ  ఉండగా , ఈ  పిల్లవాడు మాత్రం కన్నీటి ధారను ఆపుకోలేక స్పృహ కోల్పోయాడు. గురువు గారు పరుగున వచ్చి ఆ శిష్యుడి ముఖం మీద నీళ్లు జల్లగా, అతను లేచి కూర్చున్నాడు.

ఆ పిల్లవాడి పేరు సనందనుడు.అతనికి నరసింహునికి ఒక  ఉంది అని గురువు గారు అప్పుడే గ్రహించారు. ఆ రోజున రాత్రి వేళ సనందనుడు గురువు గారి పాద సేవ చేస్తున్నాడు. గురువు  వచ్చి కళ్ళు మూతపడే సమయం లో అయన కాళ్ళ మీద వెచ్చటి నీటి బొట్లు పడుతున్నట్టు అయింది. వెంటనే కళ్ళు తెరిచి లేచి కూర్చున్న  గురువు గారి ఎదుట సునందనుడు ఏడుస్తూ కనిపించాడు.

"ఎందుకు ఏడుస్తున్నావు బాబు ? ఏమైంది? ఎవరు కొట్టారు?"అని అడుగగా

"లేదు గురుదేవా మీరు ప్రొద్దున్న మాకు చెప్పిన  నరసింహుని యొక్క కథను మనసులో మననం  చేసుకుంటున్నాను , నరసింహుడు ఎంత దయగల వాడో కదా గురుదేవా ?" అని సనందనుడు సమాధానం ఇచ్చాడు.

 అవును  బాలక, మనం నరసింహుని ఉగ్రరూపం చూచి ఆయన క్రోధుడు అని మోసపోకూడదు మన మీద ఆయనకు ఎంత అపారమైన కరుణా ప్రేమలు కలవో  తెలుసునా ? మన క్షేమం కోసం అయన ఎంతో వికృత రూపం ధరించి మనలను కాపాడాడు, ఎల్లపుడు కాపాడుతాడు కూడా ! అని గురువు గారు చెప్పారు.

సనందనుడు "గురువు గారు ప్రహ్లాదుడు ఎప్పుడు ఆపదలో ఉన్న ప్రతి సమయం లోనూ నరసింహుడు అతన్ని కాపాడాడు, హిరణ్యుడు ప్రహ్లాదుడిని పర్వతం మీనుంచి త్రోసినప్పుడు నరసింహుడు ఆప్యాయంగా చేతులు చాపి ఒడిసి పట్టుకున్నాడు. ఏనుగు తో త్రొక్కివేయబడుతున్నపుడు సింహంలా  వచ్చి గర్జించి ఏనుగుని తరిమికొట్టాడు. ప్రహ్లాదుడికి విషాహారం ఇస్తే దానిని తియ్యటి పాయసంగా మార్చడు .. ఇంత ఆప్యాయత కరుణ ప్రేమ చూపిస్తూ దేవుడు అయినప్పటికీ భక్తుడి కోసం ఒక  కవచంలా మారిన  నరసింహుని కథ వింటే కన్నీరు తప్ప ఇంకేమీ రావట్లేదు  గురువు గారూ " అంటూ చెప్పాడు.

  "గురువు గారూ నా మీద కూడా ఇంతే ప్రేమ ఆప్యాయత చూపిస్తాడు కదా ? నేను ప్రహ్లాదుని వంటి గొప్ప వాడిని కాను, కానీ నాకు ఏ కష్టం వచ్చిన నరసింహుడు నా  వెనుక ఉంటాడా? నాకు ఏదైనా అయితే నన్ను కాపాడడానికి పరుగున  వస్తాడా? అని అమాయకంగా అడిగాడు "

సనందనుడుని భక్తి  చూచి గురువు గారికి మిక్కిలి ఆశ్చర్యం, సంతోషం వేసింది. బాలుడిని హత్తుకుని, ముద్దాడాడు. నరసింహునితో ఈ  బాలునికి సహజ సిద్ధమైన అనుబంధం ఉందని గ్రహించి , ఇలాంటి శిష్యుడు దొరకడం అరుదు అని భావించాడు. గురువు గారు "స్వామికి నువ్వు ప్రహ్లాదుడు వేరు వేరు కాదు,ఇద్దరు ఒక్కటే. నమ్ముకున్న వారిని ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా రక్షిస్తాను అని ఆయన మనకి వేదాల ద్వారా పురాణంలా ద్వారా చెప్పుచున్నారు" అని అన్నారు .
ఇంకా ఏమైనా అడగాలా బాలకా అని అడుగగా ఆ శిష్యుడు గురువు గారిని ప్రొదున్న చెప్పిన నరసింహుని కథ మళ్ళీ వినిపించమన్నాడు.బాగా చీకటి పడింది, దీపపు కాంతి కూడా మసకబారుతోంది,అయినప్పటికీ శిష్యుడి కోరిక మేరకు గురువు గారు లేచి మళ్ళీ ఆ కథను వినిపించారు. కానీ ఈ సరి ఇంకా ఎక్కువ పద్యతాత్పర్యాలతో మనోహరంగా చెప్పసాగారు. ఆరోజు నుంచి గురువు గారు ఆ బాలుడి సేవలకు మెచ్చ్చి ఏదైనా అడుగమనగా సనందనుడు నరసింహ వృత్తాంతం చెప్పమనడం, ఆయన చెప్పడం ఒక అలవాటుగా మారింది.

ఆ కథ సనందనుడి మదిలో చొచ్చుకుపోయింది.. సింహపు తల ఆకారం ఉన్న ఆ దేవుడిని చూడాలనే కోరిక పెరిగింది.ఒక రోజు అదే గురువుకి విన్నవించగా,ఆయన సంతోషించి విద్యాభ్యాసం అయ్యేవరకు ఆగమన్నారు. ఆ రోజు రానే  వచ్చింది. గురుకుల విద్యాభ్యాసం పూర్తి అయ్యింది. తల్లి తండ్రులు గురుదక్షిణ ఇఛ్చి తమ పిల్లల్ని తీసుకెళ్లడానికి వచ్చారు.ఒక్క్కో విద్యార్థికి సలహాలు సూచనలు ఇస్తూన్నారు గురువు,కానీ కొంత మంది శిష్యులను మాత్రం ప్రత్యేక అభ్యాసం కొరకు రెండు వారాలు వరకు పంపనని కన్నవారికి చెప్పారు. వారిలో సనందనుడు కూడా ఉన్నాడు. అతని తల్లితండ్రులకు అతను సాధారణ జీవితం గడిపాడు అనే విషయాన్నీ చెప్పారు. దీంతో అతని కన్నవారు బాధపడ్డారు,కానీ కుమారుడు గొప్ప వ్యక్తి అవుతాడని సంతోషించారు.

పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి స్నానము చేసి, నది నీరు పొట్ట వరకు వచ్చే విధంగా నదిలో నున్నసనందుడికి గురువు గారు అత్యంత పవిత్రమైన నరసింహ మూల మంత్రాన్ని చెవిలో 3 సార్లు  వినిపించారు. దీనికే మంత్ర రాజం  అని పేరు. దాని తాత్పర్యం కూడా చెప్పి, అక్షరదోషాలు సరి చేసి ఆశీర్వదించారు.

తరువాతి రోజన గురువు సనందనుడి దగ్గరకు వఛ్చి "ఈనాటి తో నీ విద్యాభ్యాసం పూర్తిగా
అయ్యింది, నేను ఈ ఆశ్రమం హద్దు చివరి వరకు వస్తాను అక్కడ నుండి అడివి మొదలు అవుతుంది , నాయనా నువ్వు అక్కడ ఒక ఆసనం ఏర్పాటు చేసుకుని ఈ మంత్రం రాజాన్ని పది లక్షల సార్లు జపించాలి అప్పుడు నీకు నరసింహుడు కనిపిస్తాడు అని , అహం వీడితేనే దేవుడు సాక్షాత్కరిస్తాడు" అని చెప్పి అడివి మొదలు వరకు వచ్చి గురువు ఆశ్రమానికి వెళ్లిపోయారు.

సనందనుడి ఆధ్యాత్మిక యాత్ర మొదలైంది. కానీ ఇక్కడే ఒక చమత్కారం జరింగింది. దేవుడు ఎవరికీ సులువుగా కనిపించదు కదా మరి!!

ఎప్పుడైతే గురువు గారు సనందుడిని ప్రత్యేకంగా చూడడం మెదలుపెట్టి అతనిని మిగతా పిల్లలతో కాకూండా మంత్రాన్ని ఉపదేశించి పంపారో , ఆ రోజున అతని మదిలో తాను తక్కిన వారి కంటే గొప్ప అనే చిన్న ఆలోచన మొదలైంది.. అతని తల్లి తండ్రులతో ఏనాడైతే సనందనుడు గొప్ప యోగి అవుతాడని చెప్పారో అప్పటినుండి సనందుడిలో ఆధ్యాత్మిక అహం పెరిగింది.

మన పురాణాలలో ఎన్నో రకాల రాక్షసులను, వారి గుణాలను , పాపాలను విన్నాము. కానీ ఈ ఆధ్యాత్మిక అహం కంటే గొప్ప పాపము, గొప్ప రాక్షస గుణము ఈ సృష్టిలో ఎక్కడ లేదు. ఈ దుర్గుణం హిరణ్యాక్షుడు కంటే చెడ్డది. అతను చనిపోయేముండైననుఁ భగవంతుడిని చూసినాడు, కానీ ఈ దుర్గుణం ఉన్నవాడు ఏ నాటికి దేవుడిని చూడలేడు.

ఒకప్పటి సనందనుడు పిలిచి ఉంటే నరసింహుడు పరుగు పరుగున వచ్చి ఉండేవాడు. కానీ ఇప్పుడున్న ఏ బాలుడు ఆధ్యాత్మిక అహమ తో కూడుకుని ఉన్నాడు..నరసింహుని మీద ఉన్న ఒకప్పటి ప్రేమ కనిపించుటలేదు. ఇందుకు వైకుంఠం లో శ్రీ మహా విష్ణువు ఎంతో చింతించసాగాడు. ఆ విషుణువు కు ప్రేమనే ముఖ్యం తప్ప పూజలు కావు. తన సనందుడు మళ్ళీ  తనను ప్రేమించేలా చేసుకునేందుకు ఒక నాటకం పన్నాడు.

కాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ ద్వారా వైద్యులు నయం చేయునట్లు, విష్ణువు మన అహాన్ని తన మాయ ద్వారా మనకు తెలియచేసి ఆ తర్వాత దూరం చేస్తాడు, ఆయన కంటే గొప్ప వైద్యుడు ఈ ప్రపంచం లో ఎవరు ఉన్నారు?

సనందనుడు అడవిలో ఒక నిర్మల ప్రదేశానికి చేరుకొని తాపం కోసం అన్ని సిద్ధం చేసుకున్నాడు. పద్మాసనం లో కూర్చుని జపం తాపం మొదలుపెట్టాడు. ఇంతలో శ్రీ మహా విష్ణువు వైకుంఠం లో  మాయానవ్వు నవ్వాడు..

"సామీ ..... సామీ ..... సాములోరూ ...... " .

ఒక వేటగాడి అరుపులకు సనందనుడికి జప భంగం అయ్యింది, కోపం  తో వేటగాడిని తీక్షణంగా చూస్తున్నాడు. ఆ వేటగాడి దగ్గర ఒక విల్లు, కొన్ని అస్త్రాలు ఉన్నాయి. అతని శరీర సౌష్ఠవం బలంగా ధృడంగా ఉంది. బహుశా ఏదో ఒక జంతువుని తిని ముఖం కడుకోకుండా వచ్చి ఉన్నట్లు ముఖం మీద రక్తం తో ఉన్నాడు. అతను ఒక ఆటవిక , అమాయక వేటగాడు.

"సామీ.... " వేటగాడు అర్ధిస్తున్నాడు.

సనందనుడు "ఎం కావాలి నీకు?నేను దైవకార్యం కోసం తపస్సు చేసుకోవడం కనబడుటలేదా ? నీలాంటి వారి కోసం నాకు సమయం లేదు " అన్నాడు.

"క్షమించండి సామీ , మీలాంటి పసివాడు  ఇంత పెద్ద అడవిలో ఎం చేస్తున్నాడో నే ఆశ్చర్యం తో అడిగినా సామీ, మన్నించండి. పులులు , సింహాలూ, ఎలుగులు తిరిగే ఈ దట్టమైన అడివిలో మీరు మీ ప్రాణాలకు తెగించి ఇక్కడ ఎం చేస్తున్నారా అని తెలుసుకోవడానికి మాత్రమే అడిగా సామీ  " అని అన్నాడు వేటగాడు

సనందుడు ఇక క్షణం ఆలోచించాడు. వీడికి చెప్పిన అర్ధం కాదు అనుకున్నాడు. ఈ తెలివితక్కువ వాడికి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడు అనుకుని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు.

"నేను ఒక వింత జంతువు కోసం ఎదురు చూస్తున్నాను. నా గురువు గారు దాన్ని పట్టి తీసుకురమ్మన్నారు  " అన్నాడు. సనందనుడు

వేటగాడు "సామీ , నేను ఈ అడవిలో నా చిన్ననాటి నుంచి తిరుగుతున్నాను, ఇక్కడ ఉండే ప్రతి జంతువూ నాకు తెలుసును సామి, మేము వాటిని చంపి తింటూ ఉంటాం" అన్నాడు

ఇంకా ఇలా అన్నాడు... "ఒక చోట కూర్చుని తపసు చేస్తే జంతువు రాదు సామీ, రండి నేను మీకు సాయం చేస్తాను , వెతుకుదాం , రండి సాములోరు..  "

సనందుడు "ఓరీ , ఈ వింత జంతువు బాణాలతో పట్టబడేది కాదు.ఈ జంతువు కొన్ని మంత్రాలకు మాత్రమే లోబడుతుంది ,ఇది ఆషామాషీ జంతువు కాదు సుమా !! " అని అన్నాడు

"సామీ , ఈ జంతువు ఎలా ఉంటుందో చెప్పండి "అని వేటగాడు అన్నాడు.

సనందనుడు " ఆ వింత జంతువు చూడడానికి సింహలా  భయంకరంగా ఉంటుంది.కానీ దాని కనులు నుండి ఆప్యాయత , ప్రేమ అమృత ధారలా  కారుతుంది.శరీరం మనిషిది. నోటిలోంచి నిప్పులు కక్కే విధంగా క్రోధంగా  ఉంటుంది. ఒక పెద్ద జంతువుని కూడా క్షణాలలో తినేసేలా ఉంటుంది, నువ్వు చాల జాగ్రత్తగా ఉండాలి సుమీ, ఎంతో దూరం నుంచే చంపగలదు  "
అన్నాడు

వేటగాడు మనసు నిండుగా  నవ్వుతూ " హహహ్హా ... సామీ , అబద్ధం చెప్పకండి,నాకు ఈ అడివిలో ఉండే ప్రతి జంతువు పురుగు పుత్ర తెలుసును,మీరు చెప్పిన లక్షణాలతో ఇక్కడ ఒక్క ప్రాణి కూడా లేదు , సగం మనిషిట , సగం సింహమట హహహ్హా ..  "

"దేవుడి మీద  ఆన ఆ మృగం ఇక్కడ ఉంది " అన్నాడు సనందుడు

వేటగాడు "సాములోరూ... అయ్యా మీరు ఒట్టు పెట్టకూడదు, నేను చదువురాని  వేటగాడిని, మీరా బ్రాహ్మణులలా కన్పించుచున్నారు, అందువల్ల మీ మాట నమ్ముతున్నా, సరే ఆ జంతువుని నేనే పట్టి తెస్తా సామి , బాలుడి వాలే ఉన్న మీరు ఇక్కడే ఉండండి  "

"లేదు, నువ్వు  పట్టలేవు ," అని సనందుడు అన్నాడు. ఈ మాటకు వేటగాడి లో అహం దెబ్బతింది. ఆ జంతువును  పెరిగింది,   కన్పడనీయకుండా ఇలా అన్నాడు....

"సామీ , నువ్వు చెప్పినట్టు ఆ జంతువు ఇక్కడుంటే నేను  ఖచ్చితంగా తెచ్చి ఇక్కడ పడేస్తాను " అన్నాడు

"నువ్వు అస్సలు పట్టలేవు , నీ తరం కాదు " అన్నాడు బాలుడు

వేటగాడు పౌరుషం తో ఇలా అన్నాడు "సామీ సవాలు విసురుతున్నావా ?"

"అవును"

"సరే సామి, సవాలుకు  నేను సిద్ధం , ఆ జంతువు ని మీకు తాళ్లతో బందించి తెస్తాను "

"తేలేకపోతే ?" అడిగాడు బాలుడు

"వేటను వదిలేసి ఆకలితో చస్తాను సామీ " బదులిచ్చాడు వేటగాడు

"ఒకవేళ నువ్వు తీసుకొస్తే నేను నీకు నమస్కరిస్తాను " అన్నాడు సనందనుడు

వేటగాడు ఆ వింత జంతువును పట్టడం కోసం బయలుదేరాడు. సనందనుడు చెప్పిన గుర్తులు నెమరు వేసుకుంటున్నాడు మనసులో.. సింహం తల, ప్రేమతో నిండిన కళ్ళు, పదునైన గోళ్లు అంటూ ముందుకు సాగాడు...

సాయంత్రం అవుతోంది..ఆ జంతువు కాన రాలేదు. అప్పుడు మనసులో  ఇలా అనుకున్నాడు..
"ఓ జిత్తులమారి జంతువా! నాతోనే ఆటలాడుతున్నావా!! ఇప్పుడు చెప్తున్నాను వినుకో , నిన్ను పట్టే వరకు పచ్చి నీరు కూడా ముట్టను , దేవుని మీద ఆన ,ఇదే నా శపధం ! " అని ఆక్రోశం తో అన్నాడు

ఆ రోజు రాత్రి అతను పడుకోలేదు. సాధారణంగా కంటే కస్టపడి వేటాడే జంతువుల మీద వేటగాళ్లకు గౌరవం ఏర్పడుతుంది. ఈ జంతువు మీద కూడా అదే విధంగా గౌరవం ఏర్పడింది. ఎప్పుడూ ఒక కిలో మాసం అయినా భక్షించే వేటగాడు ఈరోజు ఏమి తినక నీరసపడుతున్నాడు. కాళ్ళు పట్టు సడలుతున్నాయి. ఓపిక నశించింది. ఎల్లప్పుడూ ఆ జంతువునే తలుస్తూ తనకు కంపించమని ప్రాధేయపడడం మొదలుపెట్టాడు. "ఓయి నా జంతువా.. సామీ చెప్పింది నిజమే ,అయితే , నీ కళ్ళు నిజంగా ప్రేమతో నిండి ఉన్నట్లయితే నన్ను ఎందుకు కరుణించవూ? ఒక్క సారి కన్పడవచ్చునుగా ?" అని ప్రాధేయపడ్డాడు.

ఇంకా ఇలా అర్ధించాడు..

"మా అమ్మ తోడు, నిన్ను ఏమి చేయను , నువ్వు నా కళ్ళ ముందుకొస్తే నేను నిన్ను ఆ సామీ దగ్గరకు తీసుకెళ్తాను, మాటిస్తిని , తప్పదు !నీకు ఎం కావాలంటే అది చేస్తాను, కానీ న మాటను కాపాడు "

మరునాడు మధ్యాహ్నం అయింది, ఇంకా జంతువు కనపడలేదు. సాయంత్రం లోపు పట్టుకోలేకపోతే పందెం ప్రకారం ఆకిలితో చనిపోవాలి. రెండు గంటల సమయం ఉంది .
ఆకలితో చనిపోయే కంటే ఇప్పుడే చనిపోవడం ఉత్తమం అని నిర్ణయం చేసుకుని ఒక కొండ శిఖరం దగ్గరకు వచ్చాడు. అతడు వేటగాడు అవ్వటంతో జీవితంలో జంతువుల మీద తప్ప దేవుని మీద ధ్యాస పెట్టి ఉండలేదు. కానీ ఇప్పుడు ఆ సింహం తల ఉన్న జంతువుని అనుక్షణం ధ్యానిస్తున్నాడు.
" ఓ జంతువు నువ్వు చాల గొప్పదానివి , నాలాంటి వాడికి దొరకవు , ఆ బ్రాహ్మణ పిల్లడు చెప్పిందే నిజం , నువ్వు మాయ మంత్రం చేతనే పట్టుకోబడతావు , కానీ నాకు అవేవి తెలియవు, నేను చదువుకోని మూర్ఖుడిని , అందుకే అనవసరం అయినా శపధాలు చేసినాను . ఓడిపోయాను , ఇంకా నేను జీవించి ఉండడం వృధా , కానీ చనిపోయే ముందు ఒకసారి నిన్ను చూడాలని ఉంది "అని వేడుకున్నాడు .

శిఖరం మీద నుంచి డుకుబోతుండగా ఒక సింహ గర్జన వినిపించింది అతనికి. ఒకసారి తిరిగి చూసాడు.

"ఆగు" అంటూ ఒక సింహం మనిషి గొంతులో మాట్లాడటం కనిపించింది. సనందనుడు చెప్పిన పోలికలు అలాగా ఆ సింహం లో కనపడ్డాయి. మనిషి శరీరం, సింహం తల, పొడుగాటి గోర్లు , కోరల్లాంటి పళ్ళు. కానీ ఆ వేటగాడు దానిని చూసి భయపడలేదు. పదిహేను అడుగుల ఎత్తు ఉన్న ఆ మృగం కళ్ళు ఎంతో ప్రేమతో నిండి ఉన్నాయి.

వేటగాడి గుండె గట్టిగ కొట్టుకోవడం మొదలుపెట్టింది.. ఆకలి దాహం అన్ని మర్చిపోయాడు. ఏదో తెలియని ఒక